schedule Monday, July 06, 2026

ఇంటర్ పరీక్షల్లో సంచలన నిర్ణయాలు..!

calendar_today March 3, 2025
person dharshininews
ఇంటర్ పరీక్షల్లో సంచలన నిర్ణయాలు..!
ఇంటర్ పరీక్షల్లో సంచలన నిర్ణయాలు..! - ఈసారి నిమిషం నిబంధనల లేదు కానీ..? - పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్‌ సెక్షన్ అమలు వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండు నుంచి జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు పలు సంచనల నిర్ణయాలను అమలు చేయబోతోంది. హాల్ టికెట్స్ లో 15 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని నిబంధన ఉన్నప్పటికి అలాంటి నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం లేదని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడం లేదని.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలు లో ఉంటుందని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని.. ఇప్పటికే పరీక్షా పత్రాలు ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలో 16439 మంది పరీక్షలకు హాజరు హాజరవుతారని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 7914 విద్యార్థులు ఉండగా ఇందులో జనరల్ 6418, వృత్తి విద్యలో 1496 మంది పరీక్షలు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో 6963 మంది విద్యార్థులుండగా 5589 మంది జనరల్ కాగా 1374 మంది వృత్తి విద్య కోర్సు కు సంబంధించిన విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అదేవిధంగా ఇంటర్ రెండవ సంవత్సరం ప్రైవేట్ విద్యార్థులు జనరల్ కు సంబంధించి 1562 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33650/