schedule Monday, July 06, 2026

పాలక మండళ్ల జోష్‌..!

calendar_today March 8, 2025
person dharshininews
పాలక మండళ్ల జోష్‌..!
పాలక మండళ్ల జోష్‌..! - తాండూరు దేవాలయాలకు చైర్మన్ల ఖరారు - ఆ మూడు దేవాలయాలకు అధ్యక్షులు వీళ్లే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని దేవాలయాలు పాలక మండళ్లతో కొలువు దీరేందుకు సిద్దమవుతున్నాయి. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం.. ఖాళీగా దేవాలయాలకు ట్రస్టు బోర్డుల నియామకాన్ని చేపడుతోంది. తాండూరులోని భద్రేశ్వర దేవాలయం, స్టేషన్‌ హనుమాన్, సీతారాంపేట్‌ హనుమాన్, నగరేశ్వర, పోట్లీ మహారాజ్ దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే భద్రేశ్వర దేవాలయంకు చైర్మన్‌గా పటేల్ కిరణ్‌ కుమార్, సభ్యుల నియామకం పూర్తయ్యింది. పాలకవర్గ సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే స్టేషన్ హానుమాన్ దేవాలయ పాలకవర్గం నియామకం పూర్తయ్యింది. చైర్మన్ గా మిస్కిన్ శంకర్‌ రావు నియామకం జరిగింది. మిగిలిన సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం, నగరేశ్వర దేవాలయం, పోట్లీ మహరాజ్ దేవాలయంకు దేవాదాయ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇదిలా ఉండగా నగరేశ్వర దేవాలయానికి దాదాపురం సతీష్‌, పోట్లీ మహారాజ్ దేవాలయానికి వరప్రసాద్ గౌడ్, కాళీకాదేవి దేవాలయంకు పి.బస్వరాజ్, సీతారాం పేట్ దేవాలయంకు భీమలింగం పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారి నియామకం దాదాపు ఖరారు అయినట్లే అని చర్చలు వినిపిస్తున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టితో దేవాలయాలకు పాలకమండళ్ల నియామకం చకచక జరుగుతున్నాయి. వీటితో పాటు నియోజకవర్గంలోని  మండలాల్లోని దేవాలయాలకు పాలక మండళ్లను పూర్తి చేయబోతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33839/