schedule Monday, July 06, 2026

బ్రాహ్మణ సమాజం అధ్యక్షులుగా గురురాజ్ జోషి

calendar_today March 8, 2025
person dharshininews
బ్రాహ్మణ సమాజం అధ్యక్షులుగా గురురాజ్ జోషి
బ్రాహ్మణ సమాజం అధ్యక్షులుగా గురురాజ్ జోషి - ఏకగ్రీవంగా ఎన్నుకున్న తాండూరు సమాజం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు బ్రహ్మాణ సమాజం నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. శనివారం తాండూరు పట్టణంలోని పాండురంగా స్వామి దేవాలయంలో సమాజం నూనత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు. సమాజం అధ్యక్షులుగా బెన్నూరు గురురాజ్ జోషి, ప్రధాన కార్యదర్శిగా కరణం మాణిక్ రావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గురురాజ్ జోషి మాట్లాడుతూ సమాజం శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సమాజం అధ్యక్షులుగా అవకాశం కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజం పెద్దలు, బ్రాహ్మణులు, సమాజం మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33863/