schedule Monday, July 06, 2026

ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితో విద్యాభివృద్ధి

calendar_today March 10, 2025
person dharshininews
ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితో విద్యాభివృద్ధి
ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితో విద్యాభివృద్ధి - తాండూరుకు ఇంటిగ్రేటేడ్ స్కూల్‌ హర్షణీయం - యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో నియోజకవర్గ విద్యాభివృద్ధికి స్వర్ణయుగం రాబోతోందని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ అన్నారు. తాండూరు నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటేడ్ స్కూల్‌కు ఆర్థిక శాఖ ఆమోదంతో పాటు రూ. 200 కోట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. తాండూరుకు మంజూరైన ఇంటిగ్రేటేడ్ స్కూల్ విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి ఆదర్శనీయమన్నారు. ప్రభుత్వ సహాకారంతో రూ. 200 కోట్లు సాధించడంతో పాటు నియోజకవర్గంలోని యాలాల మండలంలో దౌలాపూర్‌లో సుమారు 25 ఎకరాలలో అన్నివర్గాల విద్యార్థుల కోసం ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మించడం చారిత్రాత్మకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కృషితో తాండూరు విద్యార్థుల విద్యకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని అన్నారు. తాండూరుకు ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరుపై తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33895/