schedule Monday, July 06, 2026

జననేతకు.. జేజేలూ..!

calendar_today March 10, 2025
person dharshininews
జననేతకు.. జేజేలూ..!
జననేతకు.. జేజేలూ..! - బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ - తమ్ముడికి విషెస్ చెప్పిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - జ్ఞాపికను అందజేసిన టీయూడబ్ల్యూజే-ఐజేయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజల్లో జననేతగా ఆవిర్భవించిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు జేజేలు పలికారు. సోమవారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి ఆయన నివాసంలో పుట్టిన రోజు కోలాహలం ఏర్పడింది. రాత్రి వరకు పార్టీ నేతలు, వివిధ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తల తాకిడి కొనసాగింది. పుట్టిన రోజు సందర్బంగా ఉదయమే శ్రీనివాస్ రెడ్డి దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని నివాసానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై తన తమ్ముడు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలింగనం చేసుకుని స్వీటు తినిపించారు. మరోవైపు పలువురు నాయకులు కూడా తరలివచ్చి శ్రీనివాస్ రెడ్డికి వెల్లువలా శుభాకాంక్షలు తెలిపారు. నేతలు, కార్యకర్తల తాకిడితో శ్రీనివాస్ రెడ్డి నివాసం సందడిగా మారింది. రాత్రి టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డిలు కూడా శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఆయన జన్మదిన సందర్భంగా జ్ఞాపికను బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి దాటినా కూడా శ్రీనివాస్ రెడ్డి నివాసానికి నేతల తాకిడి తగ్గలేదు. అభిమాన జననేతను కలుసుకుని మనసారా జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33924/