schedule Monday, July 06, 2026

23న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

calendar_today March 16, 2025
person dharshininews
23న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
23న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 23న తాండూరు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్ణయించారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులకు ఈనెల 23న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో భారీ ఎత్తున విందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందుకు మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మైనార్టీ నాయకులు అబ్దుల్ రవూఫ్, సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, బోయరవి, అక్బర్ బాల, అన్వర్, జిలాని తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33994/