schedule Monday, July 06, 2026

వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..!

calendar_today March 23, 2025
person dharshininews
వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..!
వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..! - శంకర్ యాదవ్ నివాసంలో ఆధ్యాత్మిక శోభ - హాజరైన శ్రీశ్రీశ్రీ శివానందా స్వామి - తరలివచ్చిన భక్తులు, ప్రజా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్సన్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణం వైభవంగా జరిగింది. ఆదివారం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక పరిషత్, గీతాసత్సంగ్ సేవా సమితి సభ్యుల సమక్షంలో శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమనగ ల్లు శ్రీ రామదూత ఆశ్రమం శ్రీ నిత్యశుద్ధానంద స్వామి క్షేత్ర సంస్థాపకులు శ్రీశ్రీశ్రీ శివానంద స్వామి హాజరయ్యారు. వారి సమక్షంలో మద్భగవద్గీత పారాయణం పఠించారు. శివానంద స్వామి భగవద్గీత పర్వాలను వివరిస్తూ వాటి విశిష్ఠతను తెలిపిన తీరు అందరిని ఆధ్యాత్మిక భావాలను తట్టిలేపింది. గీతా సత్సంగ్ సమితి సభ్యులు కూడా పారాయణం చేయడంతో శంకర్ యాదవ్ నివాసంలో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. అంతకుముందు శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులతో పాటు తండ్రి హన్మయ్య, తల్లి, కుటుంబ సభ్యులు అఖండ పారాయణం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం, యజ్ఞాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో నివాసం మొత్తం మార్మోగింది. అనంతరం శంకర్ యాదవ్ చేతుల మీదుగా మహాప్రసాద వితరణ చేశారు. అఖండ పారాయణ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, శంకర్ యాదవ్ మిత్ర బృందం జొన్నల వినోద్ కుమార్, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్. ప్రేమ్ రాజ్, తాండూరుకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు, భక్తులు తరలివచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34146/