schedule Monday, July 06, 2026

అమ్మపై అభిమానం..!

calendar_today March 23, 2025
person dharshininews
అమ్మపై అభిమానం..!
అమ్మపై అభిమానం..! - పాదసేవతో ప్రేమ చాటుకున్న కుమారులు - పరవశించి కన్నీటి పర్యంతమైన తల్లి - తాండూరు కల్వ ఫ్యామిలీలో వెల్లివిరిసిన అప్యాయత తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మను మించిన దైవం లేదు అనేది జగత్‌ సత్యం. దేవుళ్లతో పాటు అమ్మను కూడా పూజించే సంస్కృతి మనది. తాండూరులోని ప్రముఖ కల్వ కుటుంట సభ్యులు అమ్మను పూజించి.. ఆప్యాయతను చాటుకున్నారు. ఇందుకు తాండూరు పట్టణంలోని బక్కప్రభు దేవాలయం వేదిక అయ్యింది. ఆదివారం తాండూరు పట్టణంలోని బక్కప్రభు దేవాలయంలో జాతర మహోత్సవాలు నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాలకు కల్వ సురేష్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు వారి అమ్మ కల్వ శమంతకమణి కూడా పాల్గొన్నారు. దేవాలయంలో పూజల అనంతరం తల్లి శమంతకమణి 76 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు పాద పూజ నిర్వహించారు. కుమారులు, కోడళ్లు కల్వ సురేష్‌, లక్ష్మీదేవి, కల్వరాజేశ్వర్ శైలజ, కల్వ సుధాకర్, కల్వ నాగరాజ్, రమాజ్యోతి, కల్వ ఉదయ్ కుమార్, నాగచంద్ర, కవ్లవ రవిశంకర్, రాణి, కల్వ శ్రీనివాస్, శారద, కల్వ ఉమాశంకర్, స్వప్న, కల్వ శ్రీనివాస్‌(రైస్), లక్ష్మీప్రియ, సాలిక అనంతలక్ష్మీ తదితరులు శమంతకమణికి పాదపూజ చేసి ఆశీస్వాదాలు తీసుకున్నారు. తనపై చూపిన అనురాగం, అప్యాయతకు తల్లి శమంతకమణి కన్నీటి పర్యంతం అయ్యారు. తనపై చాటుకున్న ప్రేమకు అందరిని ఆశీర్వదించారు. ఈ సంఘటనతో కల్వ పరివారంలో అనుబందాల ఆప్యాయతలు వెల్లివిరిశాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34170/