schedule Monday, July 06, 2026

తాండూరు సమస్యలు పరిష్కరించండి

calendar_today March 25, 2025
person dharshininews
తాండూరు సమస్యలు పరిష్కరించండి
తాండూరు సమస్యలు పరిష్కరించండి - కాగ్నానది. పంపుహౌస్ మరమ్మత్తులకు తోడ్పాటు - వరధ మంపు ప్రాంతాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి - అసెంబ్లీ సమావేశంలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంత సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలపై మరోసారి గళమెత్తారు. తాండూరు మున్సిపల్ పరిధిలో స్థానికులతో పాటు వలసదారులతో లక్షకు పైగా జనాభా నివసిస్తున్నారని వెల్లడించారు. తాండూరు ప్రాంతానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని గుర్తుచేశారు. మిషన్ భగీరథ సరఫరా ఆగితే పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే గతంలో కాగ్నానదిలోని పంపుహౌస్ ల ద్వారా తాగునీరు సరఫరా జరిగేదని, ఏండ్ల కింద ఏర్పాటు చేసిన పంపుహౌస్ లో పాత పైపులైన్లు, పాత మోటార్లు కావడంతో మరమ్మత్తులకు ఇబ్బందులు ఎదరువుతున్నాయని వివరించారు. మోటార్ల మరమ్మత్తులకు సామాగ్రి కావాలంటే బోపాల్, హర్యానా వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున ప్రభుత్వం తాండూరు ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు పంపుహౌస్ మరమ్మత్తులలో భాగంగా కొత్త పైపులై, మోటార్లు మంజూరు చేసేలా చూడాలని కోరారు. దీంతో పాటు వర్షాకాలం వస్తే తాండూరులోని సాయిపూర్. శాంతినగర్, చించొల్లి రోడ్డు మార్గంలోని ప్రాంతాలు వరధ ముంపుకు గురవుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిలుక వాగు ప్రక్షాళనతో పాటు ప్రాంతాలు వరధ ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం సహాకారం అందించాలని కోరారు. మరోవైపు తాండూరు ప్రాంత సమస్యలపై |ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళమెత్తడంపై తాండూరు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34207/