schedule Thursday, September 10, 2026

పట్టణ వాసులకు శుభవార్త..!

calendar_today March 26, 2025
person dharshininews
పట్టణ వాసులకు శుభవార్త..!
పట్టణ వాసులకు శుభవార్త..! - పురపాలికల్లో ఓటీఎస్ స్కీం - పన్నుల వడ్డీపై 90శాతం రాయితీ - గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని పట్టణ వాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలికలో పన్నులు బకాయిలు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైం స్కీంను ప్రవేశపెట్టింది. ఆస్తిపన్ను చెల్లించని యజమానులకు బకాయిల వసూల్ల కోసం జీవోను జారీ చేసింది. మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి నేటి వరకు పన్నులు కట్టని వారందరికీ ఈ జీవో వర్తిస్తుంది. పన్నులను సకాలంలో చెల్లించని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వందశాతం కట్టాల్సిన వడ్డీని కేవలం వన్‌టైం స్కీంలో కేవలం పదిశాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం విడుదల చేసింది. బకాయిలను ఉన్నవారు బకా యి పన్నుతో పాటు పదిశాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంది. 2024-25సంవత్సరం వరకు బకాయి పడ్డ వారు ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని ఏకకాలంలో కేవలం పది శాతం వడ్డీతో పూర్తిగా చెల్లించి వడ్డీపై 90శాతం రాయితీని పొందాలని జీవోలో పేర్కొంది. ఈనెల 31వ తేది వరకు ఓటీఎస్ అమల్లో ఉంటుందని, ఈ గడువులోగా ప్రజలు తమ ఆస్తి పన్నులు చెల్లించి.. వడ్డీపై 90శాతం రాయితీ పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34275/