schedule Saturday, September 12, 2026

కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలి

calendar_today March 26, 2025
person dharshininews
కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలి
కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలి - అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అవసరమైన చోట కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేషన్ దుకాణాల ఇబ్బందులపై ప్రస్తావించారు. గత పదేళ్లనుంచి కొత్త రేషన్ దుకాణాల ఊసే లేకపోవడంతో కొత్తవి మంజూరు కాలేదని విమర్శించారు. తాండూరు మండలంలోని మేజర్ పంచాయతి కరణ్ కోట్ గ్రామంలో ఎదరవుతున్న ఇబ్బందులను ఉదహరించారు. ఈ పంచాయతీలో దాదాపు 10వేల కుటుంబాలు ఉండగా 2వేల మందికి ఒకటే రేషన్ షాపు ఉండడంతో లబ్దిదారులు రేషన్ బియ్యం పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంత మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి సరుకులు పొందాల్సి వస్తుందన్నారు. కావున తాండూరు నియోజకవర్గంలో కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటు ఎంతో అవసరముందన్నారు. ప్రభుత్వం దుకాణాలను కేటాయించాలని కోరారు. ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ రేషన్ దుకాణాల కోసం ప్రతిపాదనలు పంపించాలని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇతర సమస్యలపై మాట్లాడారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34281/