schedule Monday, July 06, 2026

వసతులు, సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ

calendar_today March 27, 2025
person dharshininews
వసతులు, సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
వసతులు, సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ - అసెంబ్లీలో గళమెత్తుతున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరుకు ప్రతిపాదన - మహిళా సంఘాల బలోపేతంపై చర్చ - సానుకూలంగా స్పందిస్తున్న మంత్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి కావాల్సిన వసతులు, సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో వరసగా తాండూరు రోడ్లు, తాగునీరు, కాగ్నానది పంపుహౌస్, చిలుక వాగు ప్రక్షాళన, కొత్త రేషన్ దుకాణాలపై అసెంబ్లీలో గళమెత్తారు. తాజాగా గురువారం జరిగిన సమావేశంలో కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. ముఖ్యంగా తాండూరులో మైనార్టీలు అత్యధికంగా ఉన్నారని వారి కోసం మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం మహిళలను కోటిశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మహిళ సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా తాం డూరు నియోజకవర్గంలో మహిళ సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు. వారి ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, మహిళ సంఘాలు కూడా బలోపేతం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాండూరులోని గొల్ల చెరువును ప్రక్షాళనకు సహాకారం అందించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరిన వసతులు, సమస్యలపై సంబంధిత శాఖల మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై మనోహర్ రెడ్డి చూపిస్తున్న చొరవకు పార్టీ నేతలు, అభిమానులు ఫిదా అవుతున్నారు. మనోహరన్న మంచి నాయకుడు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34289/