schedule Monday, July 06, 2026

ఓటీఎస్‌కు రెస్పాన్స్..!

calendar_today March 28, 2025
person dharshininews
ఓటీఎస్‌కు రెస్పాన్స్..!
ఓటీఎస్‌కు రెస్పాన్స్..! - వడ్డీరాయితీపై పన్నుల చెల్లింపులు - ముందుకు వస్తున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అమలు చేస్తున్న ఓటీఎస్ పథకానికి రెస్పాన్స్ వస్తోంది. తాండూరు పట్టణంకు చెందిన మైనార్టీ నేత ముక్తదార్ పాష వారి ఇంటికి చెందిన ఇంటిపై పాత బకాయిలతో కలిపి సుమారు 40వేలు ఉండడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ కింద రూ. 25వేలకు చేరింది. దీంతో శుక్రవారం ఆయన తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డికి మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల సమక్షంలో చెల్లించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆస్తిపన్నుల బకాయిలపై ఓటీఎస్ ద్వారా 90శాతం వడ్డీ రాయతీ కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటీఎస్ ద్వార్ ముక్తదార్ ఆస్తిపన్నులు చెల్లించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల మాట్లాడుతూ మున్సిపల్లో ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ఆస్తి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. https://www.dharshininews.com/34330/