schedule Monday, July 06, 2026

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు

calendar_today March 29, 2025
person dharshininews
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో స్వాగతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు ఉత్తమ్ చంద్, వడ్డె శ్రీనివాస్, యాలాల మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34355/