schedule Monday, July 06, 2026

చలివేంద్రాలతో దాహార్తి దూరం

calendar_today March 30, 2025
person dharshininews
చలివేంద్రాలతో దాహార్తి దూరం
చలివేంద్రాలతో దాహార్తి దూరం - ప్రయాణికుల కోసం ఏర్పాటు అభినందనీయం - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్విని ప్రతినిధి : వేసవిలో చలివేంద్రాలతోనే బాటసారులు, ప్రయాణికుల దాహార్తి తీరుతుందని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో సత్య సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సేవా సమితి చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. ప్రతి యేడాది వేసవిలో చలివేంద్రంతో చేస్తున్న సేవను కొనియాడారు. ఆర్టీసీ బస్టాండ్ లోని ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34408/