కొత్త కొనుగోళ్లు షురూ..!
April 2, 2025
dharshininews
కొత్త కొనుగోళ్లు షురూ..!
- మార్కెట్లో ముహుర్తం బీట్లు
- ఉత్సహాంగా పాల్గొన్న వ్యాపారులు
తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటిలో కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రతి యేడాది ఉగాది తరువాత మార్కెట్ కమిటిలో ముహుర్తపు బీట్లు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ యేడాది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తరువాత వచ్చిన మొదటి పనిదినం సందర్భంగా బుధవారం తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో ముహుర్తపు బీట్లు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వ్యాపారులు హాజరయ్యారు. మార్కెట్ కమిటి అధికారుల సమక్షంలో సంప్రదాయంగా వస్తున్న పసుపు, కందుల కొనుగోళ్లతో ముహుర్తపు బీట్లు ప్రారంభించారు. పసుపు క్వింటాళ్లు రూ. 18900లు పలకగా.. కందులు కనిష్టంగా రూ.7400, గరిష్టంగా రూ.7800లు పలికాయి. దీంతో పలువురు వ్యాపారులు ముహుర్తపు బీట్ల సందర్భంగా పసుపు, కందులను కొనుగోళ్లు చేసి బీట్లను ప్రారంభించారు.
అనంతరం చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, వ్యాపారులు మాట్లాడుతూ తాండూరు మార్కెట్లో కొనుగోళ్లతో కళకళలాడాలని, రైతులు, వ్యాపారులు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, వ్యాపారులు పటేల్ రాంరెడ్డి, కల్వ రాధాకృష్ణ, సల్లా దామోదర్, బంటారం సుధాకర్, పలువురు వ్యాపారులు, మార్కెట్ కమిటి కార్యదర్శి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/34444/