schedule Thursday, September 10, 2026

తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య..!

calendar_today April 3, 2025
person dharshininews
తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య..!
తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య..! - ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి - తాండూరులో ఘనంగా జయంతి - పాల్గొన్న రాజకీయ, కుల సంఘాల నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య తెలంగాణ భగత్ సింగ్ అని పలువరు నాయకులు అభివర్ణించారు. గురువారం తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని యశోధ నగర్ పార్కులు దొడ్డి కొమురయ్య జయంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ లతో పాటు కుల సంఘాల నాయకులు హాజరై పార్కులోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దొరల దురాగతాలపై పోరాడిన బహుజన యోధుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాడంలో అమరుడైన ఆయన తెలంగాణ భగత్ సింగ్ గా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు నాగారం జగదీష్, కె. గోపాల్, పూజారి పాండు, పూజారి నర్సింలు, గౌడి హన్మయ్య, చీమల నర్సింలు, వెంకటేశం, బొప్పి శ్రీహరి, సురేష్, తోపాజీ రమేష్, కొంపల్లి శ్రీనివాస్, బీసీ సంఘం అధ్యక్షురాలు అనిత, నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34468/