schedule Monday, July 06, 2026

భోజనంతో పాటు వసతులపై శ్రద్ధ తీసుకోవాలి

calendar_today April 4, 2025
person dharshininews
భోజనంతో పాటు వసతులపై శ్రద్ధ తీసుకోవాలి
భోజనంతో పాటు వసతులపై శ్రద్ధ తీసుకోవాలి - వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ - తాండూరులో వసతిగృహాల అకస్మిక తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వసతులు కల్పించడంలో శ్రద్ధ తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం తాండూరు మండలం, పట్టణంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతిగృహాల్లో వంటగది, సరుకుల గది, విద్యార్థుల గదులను, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను పరిశీలించారు. హాస్టళ్ల వార్డెన్లతో కలిసి సమస్యలు, వసతులతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతులలో ఇబ్బందు రాకుండా చూసుకోవాలన్నారు. ఏమైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే చేసుకోవాలని అన్నారు. విద్యార్థుకలు కావాల్సిన అవసరాలతో పాటు క్రీడా సామాగ్రిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు వసతులు కల్పించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట తహాసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంపీఓ సుశీల్ కుమార్, వసతి గృహాల సంక్షేమ అధికారి శ్రీశైలంలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34490/