schedule Thursday, September 10, 2026

ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు

calendar_today April 5, 2025
person dharshininews
ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు
ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ - తాండూరు బ్రాహ్మణ అర్చక సంఘం కార్యవర్గంకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : నిత్యం దైవారాధనలో గడిపే బ్రాహ్మణులు ధర్మపరిరక్షులుగా నిలుస్తున్నారని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఇటీవల తాండూరు బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షులుగా పురందర్ చార్ శుక్రవార్, కార్యదర్శిగా సుధీంద్ర దేశ్పాండే, కోశాధికారిగా సుమన్ పంతులు ఎన్నికైన సంగతి తెలిసిందే. శనివారం కోట్రిక విజయలక్ష్మీ తన నివాసంలో కోడలు, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ తో కలిసి సంఘం అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులను ఘనంగా సన్మానించారు. వారికి పండ్లు, శాలువాలతో పాటు మట్టి కుండ, మొక్కలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతునికి భక్తులకు బ్రహ్మాణులు అనుసంధానంగా ఉంటారని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పునరుజ్జీవం పోసేది పండితులే అని కొనియాడారు. అందుకే బ్రాహ్మణులు ధర్మ పరిరక్షులుగా నిలుస్తున్నారని అన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34524/