schedule Monday, July 06, 2026

సర్వమత సమ్మేళనం ఆదర్శనీయం..!

calendar_today April 5, 2025
person dharshininews
సర్వమత సమ్మేళనం ఆదర్శనీయం..!
సర్వమత సమ్మేళనం ఆదర్శనీయం..! - అందరు కలిసి మెలసి జీవించాలి - తెలంగాణ చీఫ్‌ విఫ్‌ మహేందర్ రెడ్డి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - తాండూరులో ఘనంగా ఈద్ మిలాప్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ, ముస్లింలు సర్వమత సమ్మేళనంకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రంజాన్‌ పండగ తర్వాత నిర్వహించే ఈద్‌ మిలాప్‌ కార్యక్రమాన్ని శనివారం రాత్రి జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం సమద్ ఫంక్షన్ హాల్‌లో ఈద్ మిలాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలు కలిసి మెలసి ఔనత్యాన్ని చాటుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల వారు పండగలను సంతోషంగా జరుపుకుంటూ మత సామరస్యతను చాటుకోవడం ఆదర్శనీయమన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా పండుల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, యువకులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34528/