schedule Monday, July 06, 2026

జుంటుపల్లి జాతర హుండీ లెక్కింపు

calendar_today April 8, 2025
person dharshininews
జుంటుపల్లి జాతర హుండీ లెక్కింపు
జుంటుపల్లి జాతర హుండీ లెక్కింపు - దేవాలయాని రూ.10.75లక్షల ఆధాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని యాలాల జంటుపల్లి రామస్వామి దేవాలయ జాతర హుండీ లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. శ్రీరామ నవమి నేపథ్యంలో మూడు రోజుల పాటు దేవాలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వార్లకు హుండీ ద్వారా కానుకలు సమర్పించుకున్నారు. జాతర ఉత్సవాలు ముగియడంతో మంగళవారం దేవాలయంలో హుండీ లెక్కింపు ప్రారంభమయ్యింది. దేవాలయ చైర్మన్ శ్యాంసుందర్ రావు, ఈఓ నరేందర్ సమక్షంలో దేవాదాయ శాఖ మేనేజర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. నోట్లు, చిల్లర మొత్తం పోగేసి లెక్కింపును ప్రారంభించారు. ఈ లెక్కింపులో హుండీ ద్వారా దేవాలయానికి రూ. 10లక్షల 75 వేల 866లు వచ్చినట్లు చైర్మన్ శ్యాంసుందర్ రావు, ఈఓ నరేందర్లు తెలిపారు. అదేవిధంగా జాతర ఉత్సవాలకు సహకరించిన సభ్యులకు, గ్రామస్తులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34630/