schedule Monday, July 06, 2026

కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం

calendar_today April 16, 2025
person dharshininews
కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం
కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం - రాజకీయ, సామాజిక సేవలకు దక్కిన గౌరవం - అభినందించిన పలువురు ప్రజా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన సీనీయర్ రాజకీయ నేత, సామాజిక వేత్త, న్యాయవాది కరణం పురుషోత్తం రావు ఉగాది నంది పురస్కారం అందుకున్నారు. ఉజ్వల సాంకేతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారం, అవార్డులు -2025లో భాగంగా ఆయన ఎంపిక అయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరణం పురుషోత్తం రావుకు ఉగాది నంది అవార్డు అందజేశారు. గత 42ఏళ్లుగా రాజకీయంగా, సామాజిక రంగంలో ఉమ్మడి జిల్లాలో అందించిన సేవలకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఉజ్వల అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ, డా. వీరభోగ వసంతరాయ ప్రజాపతి, ఎస్ఆర్ పార్థసారధీ రెడ్డి, పారిశ్రామిక వేత్త బి. బాలరాజ్ ముదిరాజ్, జీ.శ్రీలత తదితరుల సమక్షంలో కరణం పురుషోత్తం రావు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయంగా, సామాజిక పరంగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు కరణం పురుషోత్తం రావుకు ఉగాది నంది అవార్డు అందడం పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34885/