schedule Tuesday, September 22, 2026

కొత్త ఆధార్.. ఫ్రీ..!

calendar_today September 22, 2026
person dharshininews
కొత్త ఆధార్.. ఫ్రీ..!
కొత్త ఆధార్.. ఫ్రీ..! - 30వరకు బయోమెట్రిక్ ఉచితం - పోస్టాఫీసులో రెండు ఆధార్ కేంద్రాలు - తాండూరు ప్రజలకు మరింత ఊరట తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ కోసం ఇబ్బందులు పడుతున్న తాండూరు ప్రజలకు ఊరట లభించింది. పట్టణంలోని పోస్టాఫీసులో మరో ఆధార్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రస్తుతం రెండు కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. దీంతో ఆధార్‌ సేవల కోసం వచ్చే వారికి గతంలో ఎదురైన రద్దీ, నిరీక్షణ కొంతమేర తగ్గే అవకాశం ఉంది. 5-17 ఏండ్ల వారికి ఉచితంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్‌ సేవాలను ఈనెల 30వ తేది వరకు అందించనుంది. తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం ఆధార్‌ సేవలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. పట్టణంలోని ఫోస్టాఫీసులో రెండో ఆధార్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. మూడు రోజులుగా రెండో కేంద్రం సేవలు అందిస్తున్నారు. ఇదివరకు ఒకే కేంద్రం ఉండడంతో ఆధార్ వినియోగదారులకు సేవల్లో ఇబ్బందులు ఎదురవుతుండేవి. ఈ సమస్యను గుర్తించి.. ఫోస్టాఫీసులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోస్టాఫీసులోని కేంద్రాల్లో కొన్ని ఉచిత సేవలను అందిస్తున్నారు. 0-5ఏండ్లలోపు వారికి కొత్త ఆధార్ కార్డు నమోదును ఉచితంగా అందిస్తున్నారు. వారితో పాటు కొత్తగా ఎవరు ఆధార్‌ నమోదు చేసుకున్నా ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా 5-17 ఏండ్ల వారికి బయోమెట్రిక్ ఉచితంగా అందిస్తున్నారు. ఈ అవకాశం ఈనెల 30వ తేది వరకు ఉంటుంది. ఆ తరువాత మొదటి సారి ఉచితంగా, రెండో సారి అయితే రూ. 125లు చార్జీలు చేస్తారు. మిగతా వారికి ఏదైనా ఆప్‌ డేట్ చేసుకోవాలంటే మాత్రం రూ. 75లు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలు తాండూరు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. https://www.dharshininews.com/44798/