schedule Friday, September 18, 2026

భావి శాస్త్ర వేత్తలుగా ఎదగాలి

calendar_today November 16, 2022
person dharshininews
భావి శాస్త్ర వేత్తలుగా ఎదగాలి
భావి శాస్త్ర వేత్తలుగా ఎదగాలి - తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి - శ్రీచైతన్య విద్యార్థులకు నాసా కిట్స్ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు. నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ప్రంపంచ వ్యాప్తంగా నిర్వహించే ప్రాజెక్టు పోటీలలో గత యేడాది తాండూరు శ్రీ చైతన్య విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలించారు. ఈ యేడాది పాల్గొన్న పోటీలో ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నాసా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఒదిగి ఉండాలని ఉండాలని, చదువుల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. విద్యార్థి స్థాయి నుంచే సాంకేతికను అవగాహన చేసుకుని శాస్త్రరంగంలో రాణించాలన్నారు. భవిష్యత్తులో ఉత్తమ శాస్త్ర వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నాసా పోటీలలో ప్రతిభ కనబరచడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం సుధాకర్, ఆర్ రఘు, అకాడమిక్ కో ఆర్డినేటర్ నీరస్వామి, ప్రిన్సిపల్ మదార్, డీన్ శివరాం, నాసా ఇంచార్జ్ సాయికీర్తన, నరేంద్రచారి, బాలవర్థన్ రెడ్డి, వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.