schedule Friday, September 18, 2026

శ్రీవారి కృప అందరిపై ఉండాలి

calendar_today January 2, 2023
person dharshininews
శ్రీవారి కృప అందరిపై ఉండాలి
శ్రీవారి కృప అందరిపై ఉండాలి - మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ - దస్తగిరిపేట్ దేవాలయంలో వైకుంఠ దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రీవారి కృపాకటాక్షలు ప్రజలందరిపై ఉండాలని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తాండూరు మండలం దస్తగిరిపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి దేవాలయంలో విఠల్ నాయక్ తన కూతురు ప్రశాంతితో కలిసి ఉత్తర ద్వారం గుండ వైకుంఠ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ ఆలయంలో సతీసమేతంగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనది అన్నారు. వైకుంఠ ఏకాదశి శ్రీ వారిని దర్శించుకుంటే ముక్కోటి దేవుళ్లను దర్శించుకోవడంతో సమానమన్నారు. శ్రీవారి కృపా కటాక్షాలు ప్రజలపై, పాడి పశువులపై, రైతులపై మెండుగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.