schedule Sunday, September 20, 2026

మృతురాలి అంత్యక్రియలకు సాయం

calendar_today February 14, 2023
person dharshininews
మృతురాలి అంత్యక్రియలకు సాయం
మృతురాలి అంత్యక్రియలకు సాయం - ఔదార్యం చాటిన బీఆర్ఎస్ నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంతో మరణించిన ఓ మృతురాలి కుటుంబానికి తాండూరు మండల బీఆర్ఎస్ నేతలు సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బండి కృష్ణ చెల్లెలు అనారోగ్యంతో మృతి చెందింది. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు చంద్ర శేఖర్ గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ లు మృతురానికి నివాసానికి చేరుకున్నారు. మృతురాలి అన్న బండి కృష్ణను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం రూ.3500ల ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట నగరం బుడ్డన్న, మాజీ ఉప సర్పంచ్ కాశినాధ్, నగరం లక్ష్మణ్, తుల్జప్ప, కృష్ణ తదితరులు ఉన్నారు. మరోవైపు అంతకుముందు బండి కృష్ణ చెల్లెలు మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి కూడ మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ మజీద్ ద్వారా కుటుంబానికి రూ.3 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఘనాపూర్ మైనోద్దీన్, శ్రీశైలం, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.