అభివృద్ధి నాయకుడు మనోహర్ రెడ్డి..!
September 20, 2026
dharshininews
అభివృద్ధి నాయకుడు మనోహర్ రెడ్డి..!
- పదేళ్లలో చేయదని బీఎంఆర్ రెండేళ్లలో చేశారు
- తాండూరు సొమ్ముతో మోయినాబాద్‌లో పైలెట్ ఫామ్ హౌస్
- డ్రగ్స్, గన్స్ పార్టీలు చేసుకుంది అందరికి తెలుసు
- కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేయని అభివృద్ధిని రెండేళ్లలో చేసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధి నాయకుడుగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యేపై మనోహర్ రెడ్డి చేసిన వాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించడం విడ్డూరమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు సొమ్ముతో మోయినాబాద్‌లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. ఫౌమ్ హౌస్ కేంద్రంగా డ్రగ్స్, గన్స్ వినియోగ సంస్కృతిని తెచ్చారని, ఇదేనా ఆయన చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. పదేళ్లు గుంతల రోడ్లతో ఇబ్బంది పడ్డ తాండూరు ప్రజలను పట్టించుకోని నాయకుడు రోహిత్ రెడ్డి అని విమర్శించారు.
పదేళ్లలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. కాని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని మండలానికి, గ్రామ గ్రామానికి నిధులు తెచ్చి డబుల్ రోడ్లు వేయిస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 6021 కొత్త రేషన్ కార్డులు పేద ప్రజలకు ఇప్పించిన ఘనత మన మనోహర్ రెడ్డి గారిదని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తాండూర్ నియోజకవర్గ లో 3500 మంజూరు చేయించి నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్నారని అన్నారు. పట్టణంలో పొట్లీ మహారాజ్ టెంపుల్, భద్రేశ్వర టెంపుల్ లను కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే తాండూరును దోచుకుని ఫామ్ హౌస్ కట్టుకుంటే.. మా ఎమ్మెల్యే తాండూరును అభివృద్ధి చేసి గుడులు, రోడ్లు, ఇళ్లు కట్టిస్తున్నారని పేర్కొన్నారు. తాండూరుకు కావాల్సింది దోపిడీ నాయకుడు కాదని, అభివృద్ధి నాయకుడు మనోహర్ రెడ్డి గారే అని అన్నారు. మనోహర్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
https://www.dharshininews.com/44796/