schedule Sunday, September 20, 2026

రోహిత్‌రెడ్డిపై విమర్శలెందుకు..?

calendar_today September 20, 2026
person dharshininews
రోహిత్‌రెడ్డిపై విమర్శలెందుకు..?
రోహిత్‌రెడ్డిపై విమర్శలెందుకు..? - తాండూరు ఆస్తులను తరలిస్తుందెవరో అందరికి తెలుసు - ముందు ఎమ్మెల్యే దోపిడిపై విచారణ జరపాలి - పట్టణ బీఆర్‌ఎస్‌ నేత రుద్రు పాటిల్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై లేనిపోని అభాండాలు వేయడం సరికాదని.. తాండూరు బీఆర్ఎస్ నేత రుద్రుపాటిల్ అన్నారు. రోహిత్ రెడ్డిపై, ఫామ్‌హౌస్‌ అంశాలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓ ప్రకటనలో ఖండించారు. ముందుగా తాండూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాండూరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లలోని భూముల విషయంలో ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మనోహర్‌రెడ్డి పొరుగున ఉన్న కొడంగల్‌ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. తాండూరుకు రావాల్సిన నిధులు, ప్రభుత్వ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, తాగు–సాగునీటి కేటాయింపుల విషయంలో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఆస్తులను తరలిస్తున్న కుట్ర అందరికి తెలుసని అన్నారు. ఎకరాలలో భూములు కొని గజాలలో బకరాలకు అమ్ముతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను గుర్తు చేశారు. ముందుగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆస్తులపై విచారణ చేపట్టాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్న ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాండూరు రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. https://www.dharshininews.com/44791/