schedule Sunday, September 20, 2026

పైలెట్ ఫాం హౌస్ లోనే వివాదాలు..!

calendar_today September 20, 2026
person dharshininews
పైలెట్ ఫాం హౌస్ లోనే వివాదాలు..!
పైలెట్ ఫాం హౌస్ లోనే వివాదాలు..! - పదేళ్ల ప్రయోజనాలు వాళ్ళకే - సమగ్ర విచారణ చేపట్టాలి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  తాండూరు, దర్శిని ప్రతినిధి: గత బీఆర్‌ఎస్‌ పాలనలో సామాన్యుల సంక్షేమం ఆశించిన స్థాయిలో జరగలేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. “పేదోడికి కనీసం చిన్న ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు.. కానీ కల్వకుంట్ల కుటుంబం, వారి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు” అని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గత పదేళ్ల పాలన ఫలాలు సామాన్యులకు పూర్తిస్థాయిలో అందలేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి సంబంధించిన ఫామ్‌హౌస్‌ భూమి, నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపాలని మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఫామ్‌హౌస్‌లను కేంద్రంగా చేసుకుని చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలపై పూర్తి వాస్తవాలు విచారణ ద్వారా వెలుగులోకి రావాలని ఆయన అన్నారు. యువతకు రాజకీయ నాయకులు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పర్యటనలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూర్‌ వెంకట్‌, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఈర్లపల్లి శంకర్‌, నవీన్‌ యాదవ్‌ తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44787/