schedule Sunday, September 20, 2026

గ్రూప్‌-4ఫై స్పెషల్ ఫోకస్‌..!

calendar_today June 30, 2023
person dharshininews
గ్రూప్‌-4ఫై స్పెషల్ ఫోకస్‌..!
గ్రూప్‌-4ఫై స్పెషల్ ఫోకస్‌..! - అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు - పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు - వికారాబాద్‌ అడిషనల్ ఎస్పీ మురళీధర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు నిర్వహించే గ్రూప్-4 పరీక్షలపై అందరు స్పెషల్ ఫోకస్‌ పెట్టాలని, పరీక్షలు సజావుగా జరిగేందుకు బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీధర్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని డీఎస్సీ కార్యాలయంలో డివిజన్‌లోని పోలీసు అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన అడిషనల్ ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ గ్రూప్-4 పరీక్షల సందర్భంగా తాండూరులో మొత్తం 19 కేంద్రాలను కేటాయించడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు కోసం తనతో పాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో మొత్తం 65 మందిని నియమించడం జరిగిందన్నారు. కావున రేపు జరిగే పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని, ఏమాత్రం అలసత్వం వహించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18224 chaithany collage