schedule Sunday, September 20, 2026

మంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

calendar_today July 22, 2023
person dharshininews
మంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
మంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి - ఎమ్మెల్యేతో సమస్యలకు శాశ్విత పరిష్కారం - రూ.16 కోట్లతో డ్రైనేజీ నిర్మాణ పనులు - వార్డుల్లో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ముంపు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని 12వ వార్డు ఆదర్శనగర్, 13వ వార్డు మిత్రా నగర్, 19వ వార్డులలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(సయూం) ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు తదితరులు పర్యటించారు. ఆయా కాలనీల్లో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు మార్గంలో కూడా పర్యటించి నీళ్లు నిలిచే ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వాన నీటి ముంపు ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి 13వ వార్డు చిలుక వాగు వరకు రూ.16 కోట్లతో డ్రైన్ నిర్మాణ పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే చొరవతో ముంపు ప్రాంతాల్లో వరధ సమస్యలకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18761 chaithany collage