schedule Sunday, September 20, 2026

తిరుపతిలో మహాలక్ష్మి మహాయాగం

calendar_today August 8, 2023
person dharshininews
తిరుపతిలో మహాలక్ష్మి మహాయాగం
తిరుపతిలో మహాలక్ష్మి మహాయాగం - పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తిరుపతిలో శ్రీ మహాలక్ష్మి మహాయాగం వైభవంగా జరిగింది. మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ ఝలారియా పీఠాధిపతి ఘన్ శ్యామచార్యజీ మహరాజ్ నేతృత్వంలో ఈ యాగం నిర్వహించారు. ప్రపంచ శాంతి, మానవాళి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో మంగళవారం మార్వాడి సమాజ్ ఆహ్వానం మేరకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తీ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఘన్ శ్యామచార్యజీ మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా వేద పండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకకళ్యాణం కోసం పెద్ద ఎత్తున యాగం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ జిల్లా, తాండూరు మార్వాడి సమాజం సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19152