schedule Monday, July 06, 2026

వయో వృద్దులకు ఆర్టీసీ శుభవార్త

calendar_today August 14, 2023
person dharshininews
వయో వృద్దులకు ఆర్టీసీ శుభవార్త
వయో వృద్దులకు ఆర్టీసీ శుభవార్త - రేపు ఎక్కడికి ప్రయాణించినా 50 శాతం రాయితీ - ప్రకటించిన తాండూరు డీపో మేనేజర్ సమత తాండూరు, దర్శిని ప్రతినిధి : వయో వృద్దులకు తాండూరు డీపో అధికారులు శుభవార్త చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణించే వయోవృద్ధులకు రాయితీ కల్పిస్తున్నట్లు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 50 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. స్వాతంత్య్రం దినోత్సవం రోజున ప్రయాణించే వయో వృద్ధులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చన్నారు. అయితే వృద్ధులు తమ వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వయో వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19312