schedule Saturday, September 19, 2026

పైలెట్ గెలుపు ఖాయం..!

calendar_today August 21, 2023
person dharshininews
పైలెట్ గెలుపు ఖాయం..!
పైలెట్ గెలుపు ఖాయం..! - పార్టీ టిక్కెట్ కేటాయింపు హర్షణీయం - రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నీరటి హన్మంతు తాండూరు, దర్శిని ప్రతినధి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు నీరటి హన్మంతు అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తాండూరు ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి గెలిపిస్తారని అన్నారు. మరోవైపు తాండూరు ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేయనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ కూడా ఎమ్మెల్యేకు శుభకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19500