schedule Sunday, September 20, 2026

అమ్మా బయలెల్లినాదో..!

calendar_today September 8, 2023
person dharshininews
అమ్మా బయలెల్లినాదో..!
అమ్మా బయలెల్లినాదో..! - పుర వీధుల్లో కట్ట మైసమ్మ విగ్రహా ఊరేగింపు - ఆకట్టుకున్న పోతురాజు, కళాకారుల ప్రదర్శన - ఉత్సవాల్లో పాల్గొన్న మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా బయలెల్లినాదో.. కాచేతల్లి బయలెల్లినాదో అంటూ భక్తులు కట్ట మైసమ్మ తల్లిని కీర్తించారు. తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాత కుంటలో కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహా పున ప్రతిష్టాపన ఉత్సవాలు వైభోగంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ జంగం చంద్రకాంత్ స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట సందర్భంగా తాండూరు పట్టణం శ్రీలక్ష్మి థియేటర్ సమీపంలోని శ్రీ తుల్జాభవాని దేవాలయం నుంచి కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో పోతురాజు, డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి ఆలయం వరకు కొనసాగిన ఊరేగింపు శోభాయామానతను తలపించింది. ఈ ప్రతిష్టాపన ఉత్సవాలలో కట్ట మైసమ్మ విగ్రహం, కలశం, సింహం, నాగులు, బలిపీఠం. 25 కిలోల గంట, మైక్ సెట్ విరాళ దాతలు నరేష్, నీలకంఠం, రాములు, సంధ్య, భార్గవి, లక్ష్మీ, సుధాకర్, అంజిలయ్య, గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన ఉత్సవాలు నేడు, రేపు మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఆలయ కమిటి గౌరవాధ్యక్షులు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటి అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, కార్యదర్శి కృష్ణ, కోశాధికారి రాములు.. సభ్యులు నల్ల పాపయ్య, పట్నం రమేష్. రాజేష్, నర్సింలు, బెజ్జు రమేష్, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20063/