schedule Friday, September 18, 2026

గులాబీ పార్టీని ఆదరించాలి

calendar_today November 2, 2023
person dharshininews
గులాబీ పార్టీని ఆదరించాలి
గులాబీ పార్టీని ఆదరించాలి - బీఆర్ఎస్ తోనే సంక్షేమం కొనసాగింపు - ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే సతీమణి ఆర్తిరెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని 1వ వార్డు, 24 వ వార్డులో ఆర్తి రెడ్డి పర్యటించారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ప్లోర్ లీడర్ శోభారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ రవీందర్, పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్ లతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం అందుతోందన్నారు. ఇవన్ని కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారు రావాలంటే గులాబీ పార్టీని ఆదరించాలన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాలి శాంతుకుమార్, ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, నాయకులు రాజన్ గౌడ్, సిద్ధలింగం, వెంకట సుబ్బయ్య, మహిళ నాయకులు అనిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21474/