schedule Friday, September 18, 2026

హస్తం గూటికి బీఆర్ఎస్ మహిళ నాయకురాలు

calendar_today November 3, 2023
person dharshininews
హస్తం గూటికి బీఆర్ఎస్ మహిళ నాయకురాలు
హస్తం గూటికి బీఆర్ఎస్ మహిళ నాయకురాలు - కండువా వేసి ఆహ్వానించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ తాండూరు పట్టణ పార్టీకి ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి గాజుల మాధవి. ఆమె భర్త హనుమాన్ దేవాలయ చైర్మన్ గాజుల కమలాకర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం వాల్మీకీ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి వచ్చారు. మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు కాలనీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, సాయిపూర్ బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, మసూద్, స్పోక్ పర్సన్ కల్వ సుజాత, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, మాధవి, పట్టణ . అధ్యక్షులు హబీబ్ లాల, నారా అశోక్, నాయకులు తాండ్ర రాకేష్, సాగేష్, తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21504/