schedule Thursday, September 17, 2026

సాయిపూర్ గెలుపు వీరులు..!

calendar_today December 6, 2023
person dharshininews
సాయిపూర్ గెలుపు వీరులు..!
సాయిపూర్ గెలుపు వీరులు..! - పట్లోళ్ల నర్సింలు, బాల్ రెడ్డిలకు సన్మానం - అభిమానం చాటుకున్న యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ అనగానే మాజీ డీపీసీ పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ రెడ్డిల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వాళ్లు ఏ చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారని పేరుంది. ఎన్నికలకు ముందు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డిలతో పాటు వారి సతీమణులు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపుకోసం వాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల్లో మనోహర్ రెడ్డికి సాయిపూర్ ప్రాంతం నుంచి గట్టి మెజార్టీని కూడా అందించారు. ఎమ్మెల్యే గెలుపులో కీలకంగా వ్యవహరించిన పట్లోళ్ల నర్సింలు, బాల్ రెడ్డిలను బుధవారం స్థానిక నాయకులు. యువకులు ఘనంగా సన్మానించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గెలుపులో వీరులుగా నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం తమను సన్మానించిన నేతలకు, యువకులకు ధన్యవాదాలు తెలిపారు. నమ్ముకున్న ప్రజల కోసం శక్తిమేర కృషి చేస్తామని అన్నారు. అందరి ఆదరాభిమానాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22439/