schedule Thursday, September 17, 2026

బాధ్యతగా ఎమ్మెల్యే విధులు నిర్వహిస్తా..!

calendar_today December 9, 2023
person dharshininews
బాధ్యతగా ఎమ్మెల్యే విధులు నిర్వహిస్తా..!
బాధ్యతగా ఎమ్మెల్యే విధులు నిర్వహిస్తా..! - అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : శాసన సభ నియమాలను ఎమ్మెల్యే హోదాలో బాధ్యతగా నిర్వర్తిస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో మనోహర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తూ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తూ సభ మర్యాదను, సంప్రాదాయాలను పాటిస్తానని దైవ సాక్షిగా ప్రమాణ చేస్తున్నాని అన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారి మనోహర్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22511/