schedule Wednesday, July 08, 2026

క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకోవాలి

calendar_today December 23, 2023
person dharshininews
క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకోవాలి
క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకోవాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పట్టణంలోని అంతారం రోడ్డు మార్గంలో ఉన్న వైట్ ప్యాలెస్ లో క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన కానుకల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై నియోజకవర్గ క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు క్రైస్తవుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని క్రైస్తవులకు కానుకలు, విందు ఏర్పాటు చేసిందన్నారు. క్రిస్మస్ పండగను అందరు కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చై పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, కోఆప్షన్ సభ్యురాలు సారంగా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22703/