schedule Tuesday, July 07, 2026

ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ

calendar_today December 27, 2023
person dharshininews
ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ
ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ - మనోహర్ రెడ్డిని కలిసిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. బుధవారం తాండూరు ప్రజా భవన్(క్యాంపు కార్యాలయం)కు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అధికారులు, నేతలు కలిశారు. తాండూరు విద్యుత్ శాఖ ఏడీ ఆదినారాయణ, అధికారులు వెంకట్ నాయుడు, రాఘవేందర్ రెడ్డి, కోట్ పల్లి మండల అధికారి పావనిలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాండూరు అటవి శాఖ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్ రావు కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందిచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22759/