schedule Tuesday, July 07, 2026

నేడు అయ్యప్ప పడిపూజ

calendar_today December 29, 2023
person dharshininews
నేడు అయ్యప్ప పడిపూజ
నేడు అయ్యప్ప పడిపూజ - హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి యేడాది పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో అయ్యప్ప పడిపూజను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పడిపూజను ఏర్పాటు చేశారు. ఈ పూజకు నార్సాంగి నర్సింగ్ రావు గురు స్వామి హాజరవుతున్నారు. స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ జరుగుతుందని తెలిపారు. కావున ఈ పడిపూజకు తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22792/