schedule Tuesday, July 07, 2026

సమన్వయంతో సాగుతాం..!

calendar_today January 1, 2024
person dharshininews
సమన్వయంతో సాగుతాం..!
సమన్వయంతో సాగుతాం..! - ఎస్పీ కోటీరెడ్డి ఆదేశాలను పాటిస్తాం - శుభాకాంక్షలు తెలిపిన డీఎస్పీ, సీఐలు తాండూరు, దర్శిని ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణకు, కేసుల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో సమన్వయంతో సాగుతామని తాండూరు సబ్ డివిజన్ పోలీసులు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి, అడిషనల్ ఎస్పీ మురళీధర్ కు తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ తో పాటు తాండూరు రూరల్ సీఐ రాంబాబు, తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, యాలాల ఎస్ఐ అరవింద్, బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, పెద్దేముల్ ఎస్ఐ కాశినాథ్ లు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ గత యేడాది నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారంలో సాధించిన పురోగతిని స్పూర్తిగా తీసుకుని కొత్త యేడాదిలో కూడా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో సమన్వయం పాటిస్తామన్నారు. ఎస్పీ సూచించిన ప్రణాళికలతో శాంతి భద్రతల పరిష్కారం, అక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22877/