పెట్రోల్ బంకులో రద్దీ..!
January 2, 2024
dharshininews
పెట్రోల్ బంకులో రద్దీ..!
- పోటెత్తిన వాహనదారులు
- అసలు కారణమేంటంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పెట్రోల్ బంకులో రద్దీ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు దర్నా చేపట్టారు. దీంతో పెట్రోల్ కొరత ఏర్పడడంతో మంగళవారం తాండూరులోని వాహనదారులు ప్రెటోల్ బంకులకు పరుగులు పెట్టారు. పట్టణంలోని గంజ్ మార్గంలో ఉన్న పెట్రోల్ బంకులో వాహనదారులు కిక్కిరిసి పోయారు. గంటల పాటు బారులు తీరి వాహనాల్లో పెట్రోల్ వేసుకున్నారు. దీంతో ఈ మార్గంలో ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన దర్నాను యజమానులు విరమించుకున్నట్లు ప్రకటన వెలువడింది.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/22905/