schedule Monday, September 14, 2026

శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేయండి

calendar_today January 4, 2024
person dharshininews
శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేయండి
శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేయండి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన డీఎస్పీ, సీఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డీఎస్పీ, సీఐలతో కలిసి పలు విషయాలను చర్చించారు. తాండూరులో ప్రజలకు పోలీసులు న్యాయం జరిగేలా పనిచేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సక్రమంగా పనిచేయాలన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22944/