schedule Sunday, September 13, 2026

ఫైర్ స్టేషన్ భవనం ఏర్పాటుకు కృషి

calendar_today January 4, 2024
person dharshininews
ఫైర్ స్టేషన్ భవనం ఏర్పాటుకు కృషి
ఫైర్ స్టేషన్ భవనం ఏర్పాటుకు కృషి - తాండూరు ఎమ్మెల్యే, బుయ్యని మనోహర్ రెడ్డి - శుభాకాంక్షలు తెలిపిన ఫైర్ ఆఫీసర్ నాగార్జున తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఫైర్ స్టేషన్ సొంత భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు ఫైర్ ఆఫీసర్ నాగార్జున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫైర్ ఆఫీసర్ వినతిపత్రం అందజేశారు. తాండూరులోని ఫైర్ ఆఫీసు అందుబాటులోకి తీసుకవచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఫైర్ స్టేషన్ భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22950/