schedule Tuesday, July 07, 2026

జమియితే ఉలేమా సామాజిక సేవలు ప్రశంసనీయం

calendar_today January 5, 2024
person dharshininews
జమియితే ఉలేమా సామాజిక సేవలు ప్రశంసనీయం
జమియితే ఉలేమా సామాజిక సేవలు ప్రశంసనీయం - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేను సన్మానించిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవ చేయడం ఎంతో ప్రశంసనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జమియితే ఉలేమా ఏ హింద్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మౌలానా మహమ్మద్ అబ్దుల్లా అజహర్ ఖాస్మీ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ అతహర్ ఖాస్మీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమియితే ఉలేమా ఏ హింద్ చేస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమన్నారు. వారి సామాజిక సేవకు, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇమామ్, మౌజ్ లకు ఇచ్చి హామీలను అమలు చేస్తామన్నారు. అంతకుముందు జనియితే ఉలేమా ఏ హిందు సభ్యులు తాండూరు ప్రజల తరుపున పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, జమియితే ఉలేమా ఏ హింద్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22978/