schedule Monday, September 14, 2026

ముజీబ్ ఖాన్‌ను పరామర్శించిన అజహరోద్దీన్

calendar_today January 5, 2024
person dharshininews
ముజీబ్ ఖాన్‌ను పరామర్శించిన అజహరోద్దీన్
ముజీబ్ ఖాన్‌ను పరామర్శించిన అజహరోద్దీన్ - ఇంటికి వెళ్లి పలకరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజహరోద్దీన్ తాండూరుకు చెందిన ముజీబ్ ఖాన్‌ను పరామర్శించారు. ముజీబ్ ఖాన్ జీఎంకే బిల్డర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని తమ నివాసంలో ముజీబ్ ఖాన్ ఓ ప్రమాదానికి గురయ్యారు. కాలు విరిగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరోద్దీన్ వారి నివాసానికి చేరుకుని ముజీబ్ ఖాన్ ను పరామర్శించారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ధైరంగా ఉండి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యం నింపారు. అనంతరం ముజీబ్ ఖాన్ అజహరోద్దన్ ను శాలువాతో సన్మానించారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/22990/