schedule Tuesday, July 07, 2026

సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ..!

calendar_today January 6, 2024
person dharshininews
సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ..!
సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ..! - ముద్దాయిపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి - జాతరలో పాల్గొని పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లి అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల మండలం ముద్దాయిపేట్లో ని రేణుకా ఎల్లమ్మను వేడుకున్నారు. శనివారం జాతర ఉత్సవాల సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి కోరుకున్నారు. జాతరలో పాల్గొన్న రోహిత్ రెడ్డిని ఆలయ కమిటి సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, సర్పంచులు మధుసూదన్ రెడ్డి, బసిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, బుచ్చయ్య, ఆసిఫ్, అశోక్ రెడ్డి, కృష్ణయ్య, అమర్నాథ్ రెడ్డి, సాయిలు, రామచంద్రారెడ్డి, వెంకటేష్, కృష్ణ, రాములు, శేఖర్ రెడ్డి, లాలు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23019/