schedule Sunday, July 05, 2026

ఆరేక్‌ మాల్‌ దుకాణానికి అగ్గి

calendar_today January 9, 2024
person dharshininews
ఆరేక్‌ మాల్‌ దుకాణానికి అగ్గి
ఆరేక్‌ మాల్‌ దుకాణానికి అగ్గి - మంటలకు దగ్దమైన సామాగ్రి - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: చిరు సామాగ్రి(ఆరేక్‌ మాల్‌) దుకాణంలో అగ్ని మంటలు చెలరేగాయి. ఈ సంఘటన తాండూరు పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు పట్టణానికి చెందిన ఫైజల్ అనే వ్యక్తి పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో చిరు సామాగ్రి(ఆరేక్ మాల్) దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణంలో మంటలు అంటుకోగా స్థానికులు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది చెలరేగుతున్న మంటలను ఆర్పేశారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే కుటుంబానికి చెందిన వ్యక్తిలో దుకాణంలో మంటలు అంటించారని స్థానికులు వాపోయారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23051/